AP and TS / Entertainment
నయనతార కన్నా శ్రియా బెస్ట్..
257 days ago

నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి ' వరల్డ్ వైడ్ గా రేపు రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య ' శాతకర్ణి ' పాత్రలో జీవించాడనేది యానిట్ టాక్. ఇక వశిష్టా దేవి పాత్రలో శ్రియ కనిపించనుంది.  చాలాకాలం తరువాత ఈ మూవీలో బాలకృష్ణతో జతకట్టింది శ్రియ.అయితే శ్రియ చేసిన పాత్రని మొదట నయనతారతో చేయించాలని బాలయ్య అనుకున్నాడనే న్యూస్ వచ్చింది.

రీసెంట్ శాతకర్ణి ప్రమోషన్ లో బాలయ్య ఈ విషయం పై స్పందించాడు. శాతకర్ణి షూటింగ్ స్టార్ట్ చేసే టైంకి హీరోయిన్ ఎవరూ అనేది కంఫార్మ్ కాలేదని..తరువాత వశిష్టా దేవి పాత్రకి శ్రియా బాగుంటుందని ఫిక్స్ అయ్యామని చెప్పాడు. నయనతారని శాతకర్ణిలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోలేదని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. వశిష్ట దేవిగా శ్రియ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యిందని చెప్పాడు. నయనతారతో తాను ఇంతకుముందు సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు చేసానని..కానీ శాతకర్ణిలో నయనతార కన్నా శ్రియా బాగుందని అన్నాడు బాలయ్య.

 

Read Also

 
 
Related News
JournalistDiary