India / Crime
యూరప్‌కి చెక్కేసిన ఎంపీ జేసీ
63 days ago

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై మరో రెండు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. దీంతో ఆ సంఖ్య తొమ్మిదికి
చేరింది. విస్తారా, ఎయిర్‌ ఏషియా సంస్థలు కూడా దివాకర్‌రెడ్డిని తమ విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించబోమని శుక్రవారం ప్రకటించాయి. విమాన సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించి 24 గంటలు గడవకముందే జేసీ దివాకర్‌రెడ్డి ఫ్యామిలీతో కలిసి ఎమిరేట్స్‌ విమానంలో ఫ్రాన్స్‌కి వెళ్లిపోయారు. పదిరోజులపాటు జేసీ ప్యారిస్‌లో గడపనున్నారు.

 

గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో సిబ్బందితో జేసీ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది.
దీంతో జేసీపై చర్య తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దివాకర్‌రెడ్డి ఇంటివద్ద నున్న సిబ్బంది మాత్రం, ఆరోగ్యం సరిగాలేక జేసీ ఇంట్లోనే వున్నారని అంటున్నారు. సిబ్బంది కూడా తెలీకుండా జేసీ అత్యంత గోప్యంగా ఫారెన్ టూర్ చెక్కేసినట్టు తెలుస్తోంది.

 

Read Also

 
Related News