World / General
బ్లాస్ట్‌కు ముందే బెనజీర్ పై కాల్పులు...
181 days ago

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యలో కొత్త కోణం బయటకొచ్చింది. డిశెంబర్ 27, 2007లో మానవబాంబు దాడిలో బెనజీర్ భుట్టో మరణించిన సంగతి తెలిసిందే.. కానీ బాంబు బ్లాస్ట్ కు ముందే బెనజీర్ పై  మూడు సార్లు కాల్పులు జరిగాయని కొంత మంది వాదిస్తున్నారు .దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా చూపెడుతున్నారు. మీటింగ్ స్పాట్  లో  వెైట్  డ్రస్ లో ఉన్న వ్యక్తి  తుపాకీతో బెనజీర్ భుట్టో పై మూడు సార్లు కాల్పులు జరిపాడనీ, ఆతరువాత బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటూ స్థానిక కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి  బెనజీర్ సభా స్థలినుంచి మాట్లాడుతున్నప్పటి వీడియో ఒకటి రిలీజైంది. సోషల్ మీడియా లో ఇప్పుడా వీడియో వైరల్ అయింది.

దేశ బహిష్కరణకు గురై ..శిక్ష పూర్తి అయిన తరువాత దుబాయ్ నుంచి పాకిస్థాన్ కు తిరిగొచ్చిన ఆమె, ముషారఫ్ మిలిటరీ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్నికల్లో  ముషారఫ్ పై పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. దుబాయ్ నుంచి  పాకిస్థాన్ కు తిరిగొచ్చిన  బెనజీర్ పై జరిగిన  దాడిలో ఆమె సురక్షితంగా బయట పడ్డారు. అయితే  ఎన్నికల సందర్బంగా  రావల్పిండిలోని లియాఖత్ నేషనల్ భాగ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న బెనజీర్  హత్యకు గురయ్యారు. అయితే బెనజీర్ హత్యకు పర్వేజ్ ముషారఫ్ కారణమంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

 

 
 
 
Related News

JournalistDiary