India / Crime
బెంగళూరు లైంగికవేధింపుల సీసీటీవీఫుటేజ్‌లో టాప్‌సీక్రెట్
286 days ago

2016 డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగళూరులో జరిగిన సామూహిక లైంగికవేధింపుల ఘటన దేశవ్యాప్తంగానేకాదు, ప్రపంచవ్యాప్తంగానూ సంచలనం రేపింది. బెంగళూరులోని ప్రధాన రహదారుల్లో ఆడవాళ్లపై అల్లరి మూకలు, సామూహికంగా లైంగిక వేధింపులుకు పాల్పడ్డాయి. అయితే, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సరికొత్త కోణం కనిపించింది. ఈ ఘటనలకు సంబంధించి తమకు జరిగిన అన్యాయాన్ని అందరికంటే ముందు మీడియాకు వెళ్లగక్కింది ఓ జంట. కావాలనే.. సందట్లో సడేమియాలా ఈ కపుల్ ఇన్సిడెంట్ ను తమకు అనుకూలంగా మల్చుకున్నట్టు తెలుస్తోంది.

అక్కడ జరిగిన తతంగాన్ని క్షుణ్ణంగా సీపీ టీవీ ఫుటేజ్ లో పరిశీలించిన పోలీసులకు కొత్త సంగతి బోధపడింది. అందేంటంటే.. 34ఏళ్ల ఇర్షద్ ఖాన్ అనే వ్యక్తికి వివాహమై మూడేళ్ల కొడుకున్నాడు. అయితే, ఇతను తనకు మరదలివరసయ్యే ఓ యువతితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. రెండో భార్యగా చేసుకుంటానంటూ ప్రపోజ్ చేశాడు. అయితే, దీన్ని యువతి కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంలో తలెత్తిన సామూహిక లైంగికవేధింపుల్లో తమకు అవమానం జరిగిందని వీళ్లిద్దరే పోలీసులకు, మీడియాకు చెప్పిన వాళ్లలో ముందున్నారు.

తీరా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే, సదరు యువతిపై ఎలాంటి వేధింపులు జరుగలేదని, ఆసమయంలో వీళ్లిద్దరూ కావాలనే చాలా చనువుగా ప్రవర్తించాన్న సంగతి కూడా పోలీసులకు తెలిసింది. దీంతో కూపీలాగిన పోలీసులకు సదరు ఇర్షద్ ఖాన్ కావాలనే ఈ నాటకమాడాడని, ఆయువతిని ఇలా పాపులర్ చేస్తే వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారని, అప్పుడు తానే రెండో భార్యగా చేసుకోవచ్చని ఇంత సీన్ క్రియేట్ చేశాడంటున్నారు.  

 

Read Also

 
Related News
JournalistDiary