India / Crime
బెంగుళూరు ఘటన.. కీచకులు వీళ్లే
288 days ago

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ మేఘారిక్ వెల్లడించారు. ఈ దారుణానికి ఆరుగురు వ్యక్తులు పాల్పడ్డారని, అందులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అయ్యప్ప ప్రధాన నిందితుడని తెలిపారు. అతడు ఐటీఐ చదువుతున్నట్లు తెలిపారు. కొన్నిరోజులుగా బాధితురాలి వెంట పడుతున్నాడని, అతడే ఆమెను లైంగికంగా వేధించినట్లు కమిషనర్ వివరించారు.

నిందితులు లెనో, అయ్యప్ప, రాజు, చిన్నులు చదివింది తక్కువే అయినా చట్టాల పట్ల అవగాహన కూడా ఉందన్నారు పోలీసులు. కమనహల్లి ప్రాంతంలో వీళ్లంతా పని చేస్తున్నారని, వేధింపులకు గురైన యువతి కూడా అదే ప్రాంతంలో పెయింగ్ గెస్ట్‌గా వుంటోంది. మిజోరాంకు చెందిన బాధిత యువతి జనవరి 1న ఆటో దిగి హాస్టల్‌కు వెళ్తుండగా ఆమెని టూవీలర్‌పై వెంబడించాడు ఓ యువకుడు. ఆ యువతిపై దాడి చేయబోతుండగా, అతడి చేతిని కొరికేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు.. ఆమెను పక్కకు తోసేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ అమ్మాయి కోసం పదే పదే హాస్టల్‌కి అతడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. తాగిన మైకంలో ఉండటంతోనే తాము యువతిని వేధించామని విచారణలో నిందితులు అంగీకరించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

 

Read Also

 
Related News
JournalistDiary