India / Sports
పాకిస్తాన్ గెలిస్తే వందకు రూ. 300
6 days ago

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గేమ్ కోసం ప్రపంచం మొత్తం సిద్ధంగా వుంది. క్రికెట్ వరల్డ్ లో బద్ధ శత్రువులుగా పేరున్న ఇండియా, పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరడంతో కోట్లాది కళ్ళు అటువైపే చూస్తున్నాయి. సరిగ్గా ఈ గ్యాప్ లోనే.. బెట్టింగ్ బాబులు బిజీ అయిపోయారు. ఈసారి మొత్తం రూ. 2 వేల కోట్ల మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు లెక్క కూడా తేలిపోయింది.

కోహ్లీ సేన గెలిస్తే వంద పెట్టుబడికి 147 రూపాయలు తిరిగి వస్తుందని, పాకిస్తాన్ గెలిస్తే రూ. 300 మార్జిన్ ఖాయమని బెట్ ఫెయిర్ వెబ్ సైట్ చెబుతోంది. మ్యాచ్ టైం దగ్గర పడుతున్నకొద్దీ ఈ కాలిక్యులేషన్లో మార్పులొచ్చే ఛాన్సుంది. క్రికెట్ పందెంలో కరడుగట్టినవాళ్లంతా ఈ లెక్కల్లోనే మునిగిపొయ్యారిప్పుడు. టెక్నాలజీ పెరిగిపోవడం, హోస్ట్ కంట్రీ ఇంగ్లాండ్ లో జూదం చట్టవిరుద్ధం కాకపోవడం.. ఈ బెట్టింగ్ వెర్రిని మరింత పెంచేసింది.

 

 
 
 
Related News

JournalistDiary