AP and TS / Politics
వీసాల వేటు మొదలయింది..!
170 days ago

హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది. ట్రంప్ గెలుపుతో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తన ఎజెండాను అమలుచేయడానికి సిద్దమైంది. ‘ప్రొటెస్ట్ ఎండ్ గ్రో అమెరికన్ జాత్స యాక్ట్’ వేటుతో బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. దీంతో భారతీయిత హెచ్-1బి వీసాల ఆశలు గల్లంతయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిస్నీలాండ్ వంటి కంపెనీలు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో విదేశీయిల్ని నియమిస్తున్నారనే కారణాలతో ఆ సంస్థలపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ హెచ్-1బి వీసాల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇదిలా వుండగా అమెరికన్ కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టడంతో భారతీయులు ఐటీ సంపెనీల మీద ప్రభావం పడింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో వంటి కంపెనీల  షేర్ల ధరలు పడ్డాయి. టెక్ మహీంద్ర, హెక్సావేర్ టెక్నాలజీస్, హెచ్‌సిఎల్ సంస్థల షేర్లు సైతం కిందకు చూస్తున్నాయి. దాదాపు 22 వేల కోట్లు మార్కెట్ వ్యాల్యువేషన్ కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలు తెలియచేస్తున్నాయి.

హెచ్-1బి వీసాలు పొందటానికి కావాల్సిన అర్హతల్ని మార్చడంతో భారతీయ ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది కొంతకారణంగా వినిపిస్తున్నమాట. సాలీనా లక్ష జనల్లో కనీస వేతనం, మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలనే నిబంధనల్ని బిల్లులో చేర్చడం కూడా భారతీయులకు ప్రతిబంధకాలు కానున్నాయి.


 

 
 
 
Related News

JournalistDiary