AP and TS / Entertainment
భాగమతి దుమ్ముదులిపేస్తోంది
14 days ago

30 ప్లస్‌లోనూ అనుష్క కెరీర్ గ్రాఫ్ న్యూహైట్స్‌కి చేరుకుంటోంది. ఇప్పటివరకు సౌత్‌కే పరిమితమైన ఈ అమ్మడు, బాహుబలి2 తో నార్త్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది. దేవసేనగా అనుష్కని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు ఈ అమ్మడి నెక్స్ట్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ బడా ప్రొడక్షన్‌ హౌస్‌లు ఆఫర్స్ ఇస్తున్నా, న్యూప్రాజెక్టులు ఓకే చేయడంలేదు.

అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న ‘భాగమతి’పై బాలీవుడ్ కన్నుపడింది. దీని హిందీ వెర్షన్, డిజిటల్ రైట్స్ 12 కోట్లపైనే ఆఫర్ వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న న్యూమూవీ హిందీ డిజిటల్ రైట్స్‌కి 11 కోట్లు వస్తే.. భాగమతికి అంతకుమించి రావడంతో ఆశ్చర్యపోతున్నారు. భాగమతికి తెలుగు, తమిళ్ రైట్స్‌కి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట.దీంతో ప్రొడ్యూసర్లకి రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చేసినట్టే అన్న టాక్ నడుస్తోంది!

 
 
Related News