Telangana / Crime
హైదరాబాద్‌లో బీటెక్, ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్య
8 days ago

ఫ్యామిలీ కలహాలతో ఓ బీటెక్ స్టూడెంట్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్‌లో గత అర్ధరాత్రి మౌనిక అనే
విద్యార్థిని ఉరి వేసుకుంది. నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆమె, ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌ లో‌
స్టేటస్‌ని అప్‌లోడ్ చేసింది. ప్రతి నిమిషం నా జీవితం వరెస్ట్‌గా మారిందని రాసుకొచ్చింది. కుటుంబ కలహాలతోనే సూసైడ్
చేసుకుందని భావిస్తున్నారు పోలీసులు.

 

మరోవైపు మాదాపూర్‌లో ఇంటర్ విద్యార్థిని ఒకరు సూసైడ్ చేసుకుంది. శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న 17 ఏళ్ల సంయుక్త సొంతూరు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాణంపల్లి. హాస్టల్‌లో గతరాత్రి ఉరి వేసుకుంది. విద్యార్థిని వద్ద సూసైట్ నోట్ దొరికిందని.. అది పోలీసుల వద్ద ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Read Also

 
Related News
JournalistDiary