India / Crime
బ్లాక్‌మనీ.. కటకటాల్లో బిజినెస్‌మేన్ శేఖర్‌రెడ్డి
242 days ago

అక్రమంగా డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, వ్యాపారవేత్త శేఖర్‌‌రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్‌ చేసింది. శేఖర్‌తోపాటు ఆయన సోదరుడు, ఆడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వీళ్లని చెన్నైలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీళ్లకి జనవరి 3వ వరకు రిమాండ్‌ విధించింది. 

పెద్దనోట్లు రద్ద తర్వాత 10 రోజుల కిందట శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.127 కోట్ల నగదు, 100 కేజీలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో వివిధ కింద శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శేఖర్‌రెడ్డిని తమ కస్టడీకి తీసుకునేందుకు సీబీఐ వేసిన పిటిషన్ గురువారం కోర్టు ముందుకు రానుంది.

 
 
Related News