India / Crime
చిట్‌‌ఫండ్ స్కామ్.. ఎంపీ అరెస్ట్.. ఆపై టెన్షన్
289 days ago

రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కామ్‌లో బెంగాల్‌కి చెందిన మరో ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయ‌న‌ను విచార‌ణ‌కు పిలిచిన అధికారులు, కొన్ని గంట‌ల త‌ర్వాత అరెస్ట్ చేసిన‌ట్లు ప్రక‌టించారు. ఎంపీ అరెస్ట్‌ను తట్టుకోలేకపోయిన ఆ పార్టీ కార్యకర్తలు.. కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. 

పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో కోల్‌కతాలోని బీజేపీ ఆఫీసు వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను మెహరించారు. ఇదే స్కామ్‌లో ఎంపీ త‌ప‌స్ పాల్‌ను డిసెంబర్ 30న అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే! ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సవాల్ విసిరారు. అరెస్ట్‌ల‌కు బెదిరేది లేదని, అంతమాత్రాన నోట్ల ర‌ద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళ‌న‌ల‌ను విర‌మిస్తామ‌నుకుంటే పొర‌పాటే అవుతుంద‌ని అన్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary