India / Crime
షేమ్.. షేమ్.. ఢిల్లీలో కూడా
112 days ago

బెంగళూరు సంఘటన మరువకముందే.. ఢిల్లీలో అలాంటి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖర్జీ‌నగర్‌ ఏరియాలో డిసెంబర్‌ 31 రాత్రి 11 గంటల సమయంలో ఓ యువతిపై వేధింపులకు దిగారు కొందరు యువకులు. ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించారు కూడా. పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన ఆ కీచకులు.. పోలీసు వాహనాలను ధ్వంసం చేసి మహిళా పోలీసులను గాయపరిచారు. అక్కడ పార్క్‌ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతో గాయపడిన పోలీసులు, కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకునేలోపు యువ‌కులు ఎస్కేప్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు ఫిర్యాదు చేయలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు పోలీసులు. మరోవైపు బెంగళూరు, మహారాష్ర్ట, ఢిల్లీ వంటి నగరాల్లో వేధింపుల ఘటనలు వెలుగులోకి రావడంపై నటుడు అక్షయ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

 

 
 
 
Related News

JournalistDiary