AP and TS / Crime
ఛీటర్ ప్రొడ్యూసర్ అరెస్ట్
8 days ago

బిజినెస్‌మన్, ప్రొడ్యూసర్ కూడా అయిన ఎస్.కె.బషీద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే తనఖా పెట్టిన ఓ ఆస్తిని తిరిగి తనఖా పెట్టి తమ బ్యాంకు నుంచి రూ.2 కోట్ల రుణం తీసుకున్నాడని బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్ నగర్ శాఖ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే ఆస్తిని తనఖా పెట్టి మరో బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న విమల్ గోయెల్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు.

‘అల్లరే అల్లరి’, ‘మెంటల్ పోలీస్’, ‘నోటుకు పోటు’, ‘ఎక్స్ వై జెడ్’ వంటి మూవీలని బషీద్ నిర్మించాడు. జీఎం జువెల్లర్స్‌కు చెందిన విమల్ గోయెల్‌తో చేతులు కలిపి బషీద్ కోట్ల రూపాయల రుణాలు ఎగగొట్టాడని అతనిపై ఆరోపణలున్నాయి. గతంలో చెక్ బౌన్స్ కేసుల్లోనూ ఇతని ప్రమేయముందట.

 
 
Related News