Telangana / Politics
టీఆర్ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు: కేసీఆర్
7 days ago

కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఎలా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ప్రజలు తమని గెలిపించారన్నారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి, ఎవరికి ఏ అవసరముందో తనకు అణువణువూ తెలుసని ఆయన చెప్పారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు.

సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు గాపడ్డాయన్నారు. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని.. ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కిలోమీటర్ల ఎగువన ఏళేశ్వరం వద్ద నిర్మించాల్సిఉండేనని ఆయన అన్నారు. సమైక్యవాదులు ఆనాడు మోసం చేసి ప్రాజెక్టును దిగువన నిర్మించారని కేసీఆర్ అన్నారు. దీంతో పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు త్రాగునీరు, భూములకు సాగునీరు కరువైందని, దీంతో అనివార్యంగా ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తలెత్తిందని కేసీఆర్ చెప్పారు.

 

Read Also

 
Related News
JournalistDiary