Telangana / Politics
కేసీఆర్ కళ్లల్లో నీళ్లు రప్పించిన ఘటన
9 days ago

ఆత్మహత్యలు చేసుకోద్దని సిరిసిల్లలోని గోడల మీద రాతలు చూశానని, అవి చూసి నా కళ్లల్లో నీళ్లొచ్చాయని చెప్పారు సీఎం కేసీఆర్. పార్టీ అధ్యక్షుడిగా సిరిసిల్ల వచ్చినప్పుడు తనకు ఈ ఘటన ఎదురైందన్నారు. చేనేత కార్మికుల తలరాతలు మార్చాలని అప్పుడే నిశ్చయించుకున్నాని తెలిపారు.

సిరిసిల్ల, దుబ్బాక, పోచంపల్లి, గద్వాల సహా ఎక్కడైనా సరే చేనేత కార్మికుల వెతలు తీరాలన్నదే నా ధ్యేయమని కేసీఆర్‌ ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొందని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల నేడు జిల్లా కేంద్రంగా మారడం ఆనందంగా ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల నిర్మాణానికి ఈరోజు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

 

Read Also

 
Related News
JournalistDiary