India / Entertainment
సెన్సార్ బోర్డ్ చీఫ్ జోషి న్యూటీమ్ ఇదే
9 days ago

సెన్సార్ బోర్డు చీఫ్‌గా గేయ రచయిత, కవి ప్రసూన్ జోషీని కేంద్రం నియ‌మించింది. జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు స‌భ్యుల‌ను ప్రక‌టించింది. నూత‌నస‌భ్యుల్లో నటి గౌతమి, నటి- నిర్మాత జీవితా రాజ‌శేఖ‌ర్, హీరోయిన్ విద్యాబాలన్, అలాగే బీజేపీ నేత వాణి త్రిపాఠి వున్నారు. ఇక న‌రేంద్ర కోహ్లి, న‌రేశ్ చంద్రలాల్‌, నీల్ హెర్బర్ట్‌, వివేక్ అగ్నిహోత్రి, వామ‌న్ కేంద్ర‌, టీఎస్ నాగ‌భ‌ర‌ణ‌, ర‌మేశ్ ప‌తంగి, మిహిర్ భూటాలు ఉన్నారు.

ఇన్నాళ్లు వివాదాస్పద సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నిహ‌ల‌నీ కొన‌సాగారు. ఆయన్ని తొలిగించ‌డంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక జోషి విషయానికొస్తే బెస్ట్ లిరిక్స్ విభాగంలో రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనకు 2015లో పద్మశ్రీ వరించింది.

 
 
Related News