AP and TS / Politics
బాబు, కేసీఆర్ హ్యాపీస్
123 days ago

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అయిన రామ్‌నాథ్‌కి మద్దతు తెలపాలని కోరారు. రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై కేసీఆర్‌, చంద్రబాబు ప్రధాని దగ్గర హర్షం వెలిబుచ్చారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఇద్దరు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిమద్దతు తెలిపారు.

ఈ సందర్భంలో మమతా బెనర్జీతో ఈ విషయమై మాట్లాడి మద్దతు కూడగట్టాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది.  అటు మిగతా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన నరేంద్ర మోదీ.. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌కు ఫోన్‌ చేసి మద్దతు కోరారు.  ప్రధాని కోరిక మేరకు వెంటనే చంద్రబాబు నాయుడు మమతకు చంద్రబాబు ఫోన్ చేసి, మద్దతు కోరారు. దీనికి సమాధానంగా, తాను నెదర్లాండ్స్ ట్రిప్ లో ఉన్నానని.. వచ్చిన వెంటనే ఈ విషయంపై మాట్లాడతానని మమత, చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది. 

 

Read Also

 
Related News
JournalistDiary