AP and TS / Politics
జగన్‌ని అంత మాటన్నాడా?
226 days ago

తిడుతున్నాడా.. పొగడుతున్నాడా.. తెలీకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అనంత ఎంపీ జేసీ దివాక రెడ్డి మళ్ళీ వార్తల్లోకెక్కారు. రెడ్డి కులస్తులందరూ జగన్ పార్టీ వైపు పరుగెత్తిపోతున్నారని, అక్కడేముందో తనకూ అర్థం కావడం లేదని జేసీ చేసిన వ్యాఖ్య తాజా సంచలనం. కులం కూడు పెట్టదన్న వాస్తవం తెలిసినవాడ్ని కనుక తాను తెలుగుదేశంలో చేరానన్న జేసీ,  మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ను కెలికేశారు.

 

ఇదంతా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే జరగడం ఇంకో విశేషం. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబున్న వేదిక మీదే జేసీ ఇలా 'ఓపెనప్' అయ్యారు.చిన్న వయసు నుంచి జగన్ ని చూస్తూ వస్తున్నానన్న జేసీ.. ఆ చనువుతో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వెంటనే మైక్ అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దివాకర్ రెడ్డి గురించి తనకు తెలుసునని, ఉన్నదున్నట్లు మనసులో దాచుకోకుండా మాట్లాడ్డం ఆయనకు అలవాటేనని.. ఒక్కోసారి తనక్కూడా జేసీ మాటలు ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పుకున్నారు. 

 

Read Also

 
Related News