AP / general news
చంద్రన్న రంజాన్ తోఫా
6 days ago

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు రంజాన్ సందర్భంగా ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద తెల్లకార్డులు కల్గిన ముస్లిం కుటుంబాలకు ఎపిలోని అన్ని జిల్లాల్లో ప్యాకెట్ల రూపంలో ఐదు కిలోల గోధుమ పిండి, రెండు కిలోల పంచదార, ఒక కిలో సేమియా, వంద గ్రామలు నెయ్యి, క్యారీ బ్యాగ్‌లో పెట్టి ఇస్తున్నారు.

ఈ సరుకులు నాణ్యతను నిర్ధారించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. చౌక దుకాణాల ద్వారా అందించే ఈ ప్యాకెట్లకు ఎలాంటి హమాలీ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు డీలర్లు చెల్లించనవసరం లేదని పౌరసరఫరా శాఖ స్పష్టం చేసింది.

 

 

 
 
 
Related News

JournalistDiary