AP and TS / Entertainment
రేపట్నుంచీ సరికొత్త చార్మీ..!
77 days ago

టాలీవుడ్ హాట్‌ బ్యూటీ ఛార్మి మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. సిట్ విచారణ తర్వాత తొలిసారి సోషల్ మీడియా ద్వారా ఓ
విషయాన్ని ట్వీట్ చేసింది. ‘‘ఒక తుపాన్ నుంచి బైటపడ్డావంటే..  నువ్వొక కొత్త జన్మ ఎత్తినట్లే. నీలో వున్న ఆ కొత్త శక్తిని నీకు తెలియజెప్పడమే ఆ తుపాను ఉద్దేశం'' అంటూ హరుకి మురకామి అనే జపనీస్ రచయిత 'కోట్' ని పోస్ట్ చేసింది ఛార్మి.  ఇక్కడ తుపాన్ అంటే.. డ్రగ్ నోటీసులన్నమాట.

టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి వుందంటూ ఇటు ప్రింట్, అటు ఎలక్ర్టానిక్ మీడియా కోడైకూసింది. ఇక సోషల్ మీడియా అయితే ఆమెని అరెస్ట్ చేయడం ఖాయమంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఛార్మి ట్వీట్‌తో ఆమె గుండె నిబ్బరం ఎంతో తేలిపోయింది.

 

A post shared by Charmmekaur (@charmmekaur) on

 

Read Also

 
Related News
JournalistDiary