World / Health
టిబికి టర్మరిక్ టెక్నిక్
333 days ago

పసుపు వల్ల రంగు.. రుచి.. సువాసనే కాదు.. శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా వస్తుందట. పాత రోజులనుంచి భారత దేశంలో వివిధ రకాలుగా పసుపు వాడకంలో ఉంది. కూరల్లో, ఆహార పదార్ధాల్లో, సౌందర్యసాధనంగా కూడా వాడే పసుపులో ఆరోగ్యాన్ని అందించగల శక్తి కూడా ఉందంటున్నారు సైంటిస్టులు. పసుపులో ఉండే ఒక రకమైన కెమికల్‌కు టిబి వ్యాధిని తట్టుకునే శక్తి ఉందట.

 

మైకో బాక్టీరియమ్ ట్యూబరిక్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల మానవుడి ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివల్ల టిబీ వ్యాధిలో మాదిరిగానే సీరం బలహీనమై పోతుంది. అయితే  పాతకాలం నుంచి మన కల్చర్‌లో భాగమైపోయిన పసుపు టీబీ వ్యాప్తి చెందకుండా కట్టడిచేస్తుందని  పరిశోధనల్లో తేలింది. పసుపులో ఉండే  క్యుమిన్అనే  రసాయనం వలనే  దానికి  ఆ రంగు వస్తుందనీ, ఇదే కెమికల్ తెల్ల రక్తకణాలను ఉత్తేజపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.  

 

 
 
 
Related News

JournalistDiary