World / Crime
అది డ్రాగన్ పనేనా?
286 days ago

డ్రాగన్ కపట బుద్ది మరోసారి బయటపడింది. పైకి స్నేహ హస్తం చాటుతూ, భారత్‌పై అధిపత్యంపై సాగించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది చైనా. తాజాగా అణు దాడులను చేయగల చైనా సబ్‌మెరైన్‌ ఒకటి కరాచీరేవు వద్ద కనిపించింది. గతేడాది మే నెలలో ఈ పిక్చర్‌ని గూగుల్‌ ఎర్త్ దాన్ని చిత్రీకరించింది.

అందులోనూ భారత్‌కు అతి సమీపంలో అణు సబ్‌మెరైన్‌ ఉండటంతో కరాచీ జలాల్లో భారత్‌ ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా చైనా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన ఫస్ట్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ స‌బ్‌మెరైన్ టైప్ 091 హాన్ క్లాస్‌కు చెందినగా భావిస్తున్నారు. ఈ తరహా అణు సబ్‌మెరైన్‌లు సుదూర లక్ష్యాలను సైతం ఛేదించగలవు. కొన్నేళ్లుగా హిందూ మ‌హాస‌ముద్ర జ‌లాల్లో చైనీస్ స‌బ్‌మెరైన్లు ఉన్నట్లు ఇండియ‌న్ నేవీ బ‌లంగా నమ్ముతోంది.

చైనీస్ స‌బ్‌మెరైన్లు పాకిస్తాన్ వైపు రావాలంటే అది మ‌ల‌క్కా, లాంబోక్‌, సుందా జ‌లసంధుల గుండానే సాధ్యమ‌వుతుందని అంటున్నారు. దీనిపై స్పందించిన ర‌క్షణశాఖ అధికారులు.. ఇలాంటివాటిని గుర్తించడం అసాధ్యమని, అక్కడున్నది అణు సబ్‌మెరైన్ అని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అవి నిశ్శబ్దంగా, ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేండా ఉంటాయ‌ని చెబుతున్నారు. 


 

Read Also

 
Related News
JournalistDiary