AP and TS / Politics
ఎగ్జామ్స్‌కు 'పేపర్ షర్ట్' కంపల్సరీ...
82 days ago

పిచ్చి కుదిరింది.. రోకలి తలకు చుట్టండి అన్నట్టుంది చైనాలోని చుజుహౌ ఎక్స్పెరిమెంటల్ స్కూల్  టీచర్ల పరిస్థితి. ఈ స్కూల్ పిల్లలు పరీక్షలు రాసేసమయంలో తలపై న్యూస్ పేపర్లు ధరించాలంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇలా తల మీదుగా న్యూస్ పేపర్ ధరిస్తే స్టూడెంట్స్  వత్తిడికి గురవ్వరనీ, ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే ఛాన్స్ కూడా ఉండదని వాదిస్తున్నారు టీచర్లు... అయితే  ఈ న్యూస్ పేపర్ కాస్ట్యూమ్.. మాస్  కాపీయింగ్‌ను ఏ మేరకు అరికడుతుందో కానీ, దీనివల్ల స్టూడెంట్స్ గౌరవానికి భంగం వాటిల్లుతుందని కొంత మంది వాదిస్తున్నారు.

 

ఈ లోగా గుర్తుతెలియని కొంతమంది విద్యార్దుల తలలపై   న్యూస్ పేపర్లు వుంచి పరీక్షలు రాయిస్తున్న  ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతోఈ తొడుగు వ్యవహారం  వెలుగులోకి వచ్చింది. కొంతమంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు. తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు. మాప్లాన్లు మాకుంటాయ్ అంటున్నారు చైనా టీచర్లు, దీనిపై మీడియాలో వచ్చిన ఫోటోలు వివాదానికి దారి తీశాయి. ఎంత రచ్చ చేసినా ఈ పధ్దతిని విడిచిపెట్టేది లేదనీ,పైగా ఇలా న్యూస్  పేపర్ ధరించడం వల్ల పరీక్షల్లో కాపీయింగ్, మానసిక వత్తిడి కూడా అరికట్టొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా పరీక్షలప్పుడు మార్కులెక్కువ రావాలనే వత్తిడి వాళ్లపై ఎక్కువగా ఉంటుందనీ, ఇలా న్యూస్ పేపర్ల 'కాస్ట్యూమ్స్'తో ఎగ్జామ్స్ రాస్తే అదంతా దూరం అవుతుందని వాదిస్తున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary