AP and TS / Entertainment
సురేందర్‌రెడ్డి మెగా ఝలక్
256 days ago

బుధవారం భారీ ఎత్తున చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ అవుతోంది. దీని తర్వాత ఎవరి డైరెక్షన్‌లో మెగాస్టార్ మూవీ చేయబోతున్నారు? ఇప్పటికే బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, క్రిష్‌లు రేసులో వున్నట్లు ఓ రేంజ్‌లో ప్రచారం సాగింది. ఇకపై ఈ తరహా గాసిప్స్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే! 

ఎందుకంటే.. 151వ ఫిల్మ్ ఎవరితో చేయబోతున్నారనే దానిపై చిరంజీవి తన ఖైదీ ప్రమోషన్‌లో క్లారిటీ ఇచ్చేశారు. 90 పర్సెంట్ సురేందర్‌రెడ్డితో వెళ్లడం ఖాయమని తన మనసులోని మాటను బయటపెట్టారు. స్టోరీ రెడీగా వుందని చెప్పిన చిరు.. తన దగ్గర మాంచి స్టోరీ వుందని సురేందర్ అన్నాడని, అందుకు నెల గడువు కోరినట్టు చిరు తెలిపారు. ఈ లెక్కన సురేందర్‌తో ఆయన ఫిల్మ్ చేయడం దాదాపు ఖాయమే! రీసెంట్‌గా చెర్రీతో ధృవ సినిమా చేశాడు సురేందర్. ఆ టైంలో చిరంజీవి- సురేందర్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం. సొంతంగా రెడీ చేసిన స్టోరీనా? లేక రీమేక్ అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. 

 
 
 
Related News
JournalistDiary