AP and TS / Politics
అవి సంస్కారంలేని మాటలు
75 days ago

ఖైదీనెం150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి. రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ పై నాగబాబు వ్యాఖ్యలు సబబేనన్నారు. నాగబాబు సున్నిత మనస్కుడని చెప్పిన చిరంజీవి.. తాము ఏమీ అనకపోయినా తమపై చేస్తున్న కామెంట్స్ పై స్పందించడం తప్పులేదన్నారు చిరంజీవి.

ఇక యండమూరి విషయంలో తీవ్రంగా స్పందించారు చిరు. నాగబాబు యండమూరిని గురువుగా భావిస్తారని, అయితే, వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పే వ్యక్తి సంస్కారం లేకుండా ఎలా మాట్లాడతారన్నారు. పుల్లవిరుపు మాటలు.. సంస్కారంలేకుండా మాట్లాడటం తప్పంటూ యండమూరిని విమర్శించారు చిరంజీవి. 

 

 
 
 
Related News

JournalistDiary