AP and TS / Entertainment
రవిప్రకాష్‌కు చిరు చెప్పిందేమిటి?
256 days ago

తన 150వ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకోసం.. 

 

రామ్‌గోపాల్ వర్మ చేసింది తప్పే!

ట్విట్టర్‌లో రామ్‌గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఐతే, నా చిత్రాల మీద ఆర్జీవీ ఎందుకు ఫోకస్ చేస్తున్నాడో అర్థంకావడం లేదు. ఇతరుల విజయాలపై ఫోకస్ చేసి మోటివేట్ చేయడం అవసరమే, కానీ.. వారి నెగిటివ్  పాయింట్లను ఎత్తిచూపడం మంచిదికాదన్నది నా అభిప్రాయం. 

 

ఖైదీ మూవీకి ఘోస్ట్ రైటర్స్? 

150వ చిత్రానికి ఘోస్ట్ రైటర్స్ వున్నారన్న ప్రచారం కేవలం  రూమర్స్ మాత్రమే. ఒక చిత్రానికి డైరెక్షన్ చేయగలను కూడా. కానీ నా కెరీర్‌లో స్టోరీకి సంబంధించిన చర్చలకు మాత్రమే పరిమితమవుతా.


టాలీవుడ్‌లో సరైన రచయితలు లేరా? 

లేకేం వున్నారు, రీమేక్ చేయాలనుకోవడానికి ఇది కారణం కాదు. మంచి స్టోరీలు, రచయితలూ వున్నారు. ఐతే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ విషయంలో నా దృష్టికి సరైన స్ర్కిప్ట్ తోచివుండకపోవచ్చు. 

 

పాత చిత్రాల రీమేక్

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రామ్‌చరణ్, రౌడీ అల్లుడు సినిమాని బన్నీ రీమేక్ చేస్తే బాగుంటుందన్నది నా ఆలోచన. 


60‌ల్లో కూడా 30 ఏళ్ల యువకుడిగా ఎలా సాధ్యం?

ఈ క్రెడిట్ అంతా నా తనయుడు రామ్‌‌చరణ్, భార్య సురేఖ‌కు దక్కుతుంది. ఇంట్లోవున్న స్విమ్మింగ్‌ఫూల్, జిమ్‌ల్లో గంటల తరబడి ప్రాక్టీసు చేయడం దీనికి కారణం.  నా డైట్‌పై సురేఖ ఇచ్చిన కఠిన‌మైన ఆంక్షలు కూడా ఇందుకు మరో రీజన్. 

 

టాలీవుడ్‌లో పోటీవుందా? 

ఆరోగ్యకరమైన పోటీ వుండాలి. హీరోలంతా స్నేహపూరిత భావనతో కలిసికట్టుగా వుండాలి. గౌతమిపుత్ర శాతకర్ణి లాంచ్‌కు హాజరైనప్పుడు ఆ మూవీ భారీ సక్సెస్ కావాలని బాలయ్యను మనసారా కోరాను. 

 

పవన్‌కల్యాణ్ గురించి

లోలోపల ఆలోచించే వ్యక్తి పవన్. మేమంతా గదిలో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, అతడు ఓ మూలన పుస్తకాలు చదువుతూ వుంటాడు. పాలిటిక్స్ విషయానికొస్తే.. అదంతా అతని ఆలోచనలు, వ్యూహాలు మాత్రమే!

 

ముద్రగడ పద్మనాభంపై వైఖరి

కాపునాడు నేత ముద్రగడ పద్మనాభాన్ని సపోర్ట్ చేయను.. కానీ, ఆయన చేపట్టిన ఉద్యమానికి మద్దతునిస్తాను.

 

కాంగ్రెస్ ఫ్యూచరేంటి?

కాంగ్రెస్‌కి ఇక భవితవ్యం లేదన్నది సరికాదు.. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు సహజమే! 

 

 

 
 
 
Related News
JournalistDiary