AP / Politics
జగన్ పాదయాత్రకు సీఎం చంద్రబాబు చెక్!
9 days ago

నవంబర్ రెండు నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేశారు ప్రతిపక్షనేత జగన్. ఇందుకు సంబంధించి
రూటు మ్యాప్ కూడా ఖరారైంది. దాదాపు ఆరునెలలపాటు 125 నియోజకవర్గాల్లో 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర
సాగనుంది. ఇదిలావుండగా అధికార తెలుగుదేశం పార్టీ కూడా జగన్ పాదయాత్ర మీద ఓ కన్నేసింది. నవంబర్ 8 నుంచి
వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు చేపట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్.

 

ఈ సమావేశాలకు ముందే పాదయాత్రకు రెడీ అవుతున్న జగన్, దానికి బ్రేక్ ఇచ్చి అసెంబ్లీ సెషన్‌కు హాజరుకావాల్సివుంది. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ అటెండెన్స్ అసెంబ్లీకి కీలకం గనుక వైసీపీ తీసుకునే స్టెప్ ఏమిటన్నదానిపై ఆసక్తినెలకొంది. జగన్ పాదయాత్ర పూర్తిగా రద్దు కాకపోయినా షెడ్యూల్‌ను ఆదిలోనే డిస్టర్బ్ చేయడంలో రూలింగ్ పార్టీ సక్సెస్ కొట్టినట్లైంది.

 

 

Read Also

 
Related News
JournalistDiary