AP and TS / Entertainment
కాస్ట్‌లీ కమెడియన్ వెన్నెల
65 days ago

కమెడియన్‌గా హైడిమాండ్ వున్న సమయంలో హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. అప్పట్లో సునీల్ లేని సినిమా వుండేది కాదు. హీరోగా టర్న్ అయిన తర్వాత ఆయన ప్లేస్ ఖాళీ అయిపోతుందని అనుకున్నారు. ఈలోగానే ‘వెన్నెల’తో మెరిసిన కిషోర్ తన కామెడీతో సునీల్ లేనిలోటు తీరుస్తున్నాడు.

రీసెంట్‌గా రా రండోయ్ వేడుక చూద్దాం, అమీతుమీ వంటి సినిమాలకు కిషోర్ కామెడీయే హైలైట్! అమీతుమీకి వెన్నెల హీరో అనే రేంజ్‌లో ‌పబ్లిసిటీ చేశారు. ఆయన ఓకే అనకపోతే తెరకెక్కేది కాదని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారంటే ఆయనకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. గతంలో 50 వేలు తీసుకునే ఈయన, సినిమాకి రెండున్నర లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. మొత్తానికి కాస్ట్లీ కమెడియన్ అయిపోయాడన్నమాట.

 

 
 
Related News