India / Sports
ఇషాంత్‌కి పెళ్లైపోయింది
42 days ago

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరు లైఫ్‌లో సెటిలైపోతున్నారు. హర్బజన్‌సింగ్, యువరాజ్ మ్యారేజ్‌లు చేసుకోగా, ఇప్పుడు ఇషాంత్‌శర్మ వంతైంది. ఆయన మ్యారేజ్ ప్రతిమ‌సింగ్‌తో అట్టహాసంగా ఢిల్లీలో సాగింది. ఈ వేడుకకు టీమిండియా ఆటగాళ్లు ధోని,  సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జూన్‌లో వీళ్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే! ఇషాంత్‌శర్మ టీమిండియా పాస్ట్‌బౌలర్ కాగా, ప్రతిమ సింగ్‌ జాతీయ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్. 

ప్రతిమ గతంలో భారత్‌ తరపున జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లకు ప్రాతినిథ్యం వహించింది. కొంతకాలం కెప్టెన్‌గా వ్యవహరించింది కూడా. ప్రతిమకు నలుగురు సిస్టర్స్ కాగా అందులో ఈమె చిన్నది, అందరూ బాస్కెట్‌‌బాల్‌ ప్లేయర్స్ కావడం విశేషం. వాళ్లంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో రాణించారు. బాస్కెట్‌బాల్‌ టీంలో వీళ్లు ‘సింగ్‌ సిస్టర్స్‌’గా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే! ప్రతిమ ఫాదర్ జీఎస్ సింగ్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీస్.. ప్రస్తుతం వారణాశిలో వుంటున్నారు. 

 
 
 
Related News

JournalistDiary