World / General
సింహం పడుకుందికదాని జూలుతో జడేస్తే..
65 days ago

అసలెందుకలా చేయాలనిపించో తెలీదుకాని, మనోడికి మాత్రం చుక్కలు కనిపించాయి. వింతగా ఉంటుందని చేస్తే వాచిపోయింది. థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సముయ్‌ ప్రాంతంలో ఓ జూ ఉంది. అక్కడ నిర్మించిన ఓ కృత్రిమ కొలనులో మొసలితో వింత వింత విన్యాసాలు చేయించడం మామూలే. యథాలాపంగా మొసలితో స్టంట్‌ ట్రిక్‌ ప్లేచేసిన వ్యక్తి మొసలి నోటిని కాసేపు తెరిచి ఉంచేలా చేశాడు.

అంతవరకూ బానే ఉందికాని అతనికి మొసలినోటిలో తలపెట్టాలన్న తలంపొచ్చింది. అంతే.. పెట్టేశాడు. కొన్ని క్షణాల పాటు మొసలి నోరు తెరిచే ఉంచినప్పటికీ నోట్లో నుంచి తల తీసే సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి తలను నోట కరుచుకుంది. రెండు క్షణాలపాటు అతడి తలని అటు ఇటూ వూపేసి తర్వాత వదిలి నీళ్లలోకి వెళ్లిపోయింది. అంతే, ఒక్కసారిగా సదరు వ్యక్తికి ప్రాణం పోయినంతపనై ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ టూరిస్ట్ ఈ సీన్ ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.

 
 
Related News