AP and TS / Entertainment
బోణీ కొట్టిన రానా !
11 days ago

సినిమా ప్రియులకు ఈ ఫ్రైడే చాలా చాలా హాట్! ఫిదా తర్వాత ఓ మోస్తరు పెద్ద సినిమాల సీజన్ మొదవడం.. ఒకేరోజు మూడు క్రేజీ ఫిలిమ్స్ బైటికి వచ్చెయ్యడం.. సినీగోయర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాల టాక్ మీద, వసూళ్ల మీద ఎవరి అంచనాలు వాళ్ళకుండొచ్చు. కానీ..ఈ బిగ్ ఫైట్ లో దగ్గుబాటి రానా బోణీ కొట్టేశాడు. ఎలాగంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 'నేనే రాజు నేనే మంత్రి' ముందంజలో ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి.

మొదటిరోజుతో పాటు, వీకెండ్ షోస్ కూడా వేగంగా బుక్ అయిపోతున్నాయి. బుక్ మై షోస్ రేటింగ్స్ లో సైతం రానా మూవీనే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి లైన్లో నితిన్ సినిమా 'లై' వుంది. ఆన్ లైన్ టిక్కెట్లతో పాటు.. ధియేటర్స్ కౌంటర్ల దగ్గర కూడా ఇదే వరస! బెల్లంకొండ శీను స్టార్ హీరో స్థాయిని చేరుకోకపోవడంతో బోయపాటి సినిమాకు అంత సీన్ లేనట్లు తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్ కరుణిస్తారని, సింగిల్ స్క్రీన్స్ కలెక్షన్లు తమను ఆదుకుంటాయని 'జయజానకీ నాయక' బయ్యర్స్ భావిస్తున్నారు.

 
 
Related News