AP and TS / Entertainment
రానా రిబ్బన్ కటింగ్ ఆగిపోయింది!
70 days ago

'నేనే రాజు-నేనే మంత్రి' సినిమా రిలీజుకు ముందే రానా ఫ్యామిలీ రెండు కోట్లు నష్టపోయింది. సొంత జిల్లాలో  తాను ఇష్టపడి ఆధునీకరించుకున్న సినిమా ధియేటర్ అగ్నికి ఆహుతైంది. దీంతో దాదాపు రెండుకోట్ల దాకా నష్టం వాటిలిందన్నది ప్రాధమిక అంచనా.

చీరాలలోని సురేశ్‌ మహల్‌..   దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్‌ కు రిపేర్లు చేసి.. రెండు స్క్రీన్లు ఏర్పాటు చేసి.. మల్టిప్లెక్స్ గా ప్రమోట్ చేయాలన్నది దగ్గుబాటి సురేష్ ప్లాన్.  దీనికి అనుగుణంగానే  అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్ది  కొత్త రూపు సంతరించుకునేలా కష్టపడ్డారు. తెల్లారితే.. సొంత ప్రొడక్షన్ మూవీ 'నేనే రాజు నేనే మంత్రి' షోతోనే థియేటర్ పునప్రారంభం. హీరో రానా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ కు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ.. ఏసీలు బిగిస్తున్న సమయంలో మంటలు చెలరేగి.. థియేటర్ మొత్తం దగ్ధమైంది. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పగలిగారు. కానీ.. ప్రదర్శనకు అనువైన పరిస్థితులు లేకుండా.. థియేటర్ పూర్తిగా డామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దగ్గుబాటి సురేష్ ను కొంత కలతకు గురిచేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary