India / Sports
డ్యాన్సర్‌ నేహాశర్మని చంపేశారు
262 days ago

దారుణం జరిగిపోయింది.. పొట్టకూటి కోసం డ్యాన్సర్ అవతారమెత్తిన ఆ యువతి, పోలీసు తూటాకి బలైంది. ఆదివారం నాభా జైలు ఘటన తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకునేందుకు పంజాబ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రూట్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేశారు పోలీసులు. అదే సమయంలో కారులోని ఐదుగురు మహిళా డ్యాన్సర్లు ఉదయం 11 గంటలకు పాటియాలోని ఓ మ్యారేజ్‌కి వెళ్తున్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో డ్రైవర్ కారుని వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు ఆపకుండా దాన్ని ఢీ కొట్టాడు. అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ వెంటనే తనవద్ద ఏకె 47 తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందింది 24 ఏళ్ల డ్యాన్సర్ నేహాశర్మ. ఈ విషయం తెలియగానే ఏఏపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

 
 
Related News