AP and TS / Politics
చిరంజీవి కష్టజీవి
19 days ago

సాంగ్స్.. ఫైట్స్ చిరంజీవికి పెద్ద అసెట్. ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. ఈ సినిమా బంపర్ హిట్ కావడం తధ్యమంటున్నారు దర్శకరత్న దాసరినారాయణరావు. చిరంజీవి ఈ సినిమాకోసం ఎంతకష్టాపడ్డారో తనకు తెలుసునని, ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకుందని దాసరి వ్యాఖ్యానించారు. అయితే, చిరుకు తమకు మధ్య విభేదాలు తొలిగినట్టేనా అన్న ప్రశ్నకు దాసరి వివరణ ఇచ్చారు.

కుటుంబంలో బేధాభిప్రాయాలు రావచ్చు. అపార్థాలు చేసుకున్న సందర్భాలున్నాయి. అంతమాత్రాన విడిపోయేబంధం కాదుమాదంటూ చెప్పుకొచ్చారు దాసరి. ఒక్క చిరంజీవి విషయంలోనేకాదు, అందరి హీరోల విషయంలోనూ ఇది వర్తిస్తుందన్నారు. తన 52ఏళ్ల తన సినీ జీవితంలో హీరోలు ఎంతకష్టపడి పైకొచ్చారో దగ్గరనుంచి చూసిన వాడినినేనని దాసరి తెలిపారు. 

 
 
 
Related News

JournalistDiary