India / Crime
పశువుల్లా బిహేవ్ చేస్తూ..
224 days ago

ఆడవాళ్లపై అకృత్యాలు.. లైంగికవేధింపులు.. కామాంధులకు సమయం సందర్భం ఏముంది.. ఆడాలేదు..ఈడా లేదు.. ఆడవాళ్లు కనిపిస్తేచాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ పశువుల్లా చెలరేగిపోతున్నారు. పనిచేసేచోట..చదువుకునేచోట..ప్రయాణసమయాల్లో ఇలా లైంగికవేధింపులకు పాల్పడుతున్నారు. ఆడవాళ్లపై జరుగుతోన్న లైంగికవేధింపులకు సంబంధించి నేషనల్ బార్ అసోసియేషన్ ఏడునెలలపాటు నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానాంశాలు ఏంటంటే, దేశరాజధాని ఢిల్లీలోనే అత్యధికంగా 63శాతం లైంగిక వేధింపులు జరుగుతున్నాయట. వర్క్ ప్లేస్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో పనిచేసే ఆడవాళ్లమీద లైంగికవేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

తర్వాత రంగాల్లో విద్యారంగంలో పనిచేసే ఆడాళ్లపైనా జరిగే లైంగికవేధింపులు అధికంగా ఉన్నాయట. తర్వాత మీడియా ఆతర్వాత లీగల్ సెక్టార్స్ లో ఈ వేధింపుల పరంపర కొనసాగుతుందని ఆ నివేదిక తెలియజేస్తోంది. మొత్తంగా వర్క్ ప్లేస్ లో 37.8శాతం, స్కూల్స్, కాలేజీల్లో 22.2శాతం, మిగతాచోట్ల 40శాతంగా ఈ వేధిపులు ఉంటున్నాయని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఈ లైంగిక వేధింపులు ఎక్కడెక్కడ ఏశాతంలో ఉంటున్నాయని కూడా ఆసర్వేలో నిగ్గుతేలింది. ఆఫీసులు, మార్కెట్స్, ప్రయాణసమయాల్లో ఇలా దాదాపు అన్ని చెట్లా ఆడాళ్లు లైంగికవేధింపులకు గురవుతున్నారట. ఆడవాళ్లను లైంగిక ఒత్తిడ్లకు గురిచేయడం, వాళ్లపై ద్వందార్థవ్యాఖ్యలు, అసభ్య విమర్శలుచేయడం, ప్రయివేట్ పార్ట్స్ లో టచ్ చేసేందుకు ప్రయత్నించడం..ఇలా అనేక ఆడాళ్లపై లైంగికవేధింపులకు పాల్పడుతున్నారని ఆ సర్వేలో నిగ్గుతేలింది. 


 

Read Also

 
Related News