India / Politics
హోటల్స్‌లో తింటే ‘ఆ ఛార్జ్’ కట్టక్కర్లేదు
80 days ago

వీకెండ్ ఫ్యామిలీతో హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే సామాన్యుడికి స్వల్ప ఊరట. అక్కడ అదనంగా వడ్డించే సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా? వద్దా? అనేది ఇకపై పూర్తిగా వినియోగదారులకే వదిలేసింది కేంద్రం. ఈ లెక్కన సర్వీస్ ఛార్జ్ భారం కాదన్న మాట. నార్మల్‌గా హోటళ్లు, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు. వంటకాలతోపాటు సర్వీస్ కూడా పూర్తి హ్యాపీగా ఉంటేనే సర్వీస్ ఛార్జ్ చెల్లించవచ్చు. లేదంటే చెల్లించాల్సిన అవసరంలేదని కేంద్ర వినియోగదారుల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సోమవారం ఆహార‌, వినియోగ‌దారుశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ క్లారిటీ ఇచ్చేశారు. 

బిల్‌పై స‌ర్వీస్ ట్యాక్స్‌ను తీసుకోవ‌డం నేరమని, ఇది స్వచ్ఛమైన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ఉంద‌న్నారు మంత్రి. ఉన్న ప‌న్నులకు అద‌నంగా స‌ర్వీస్‌ ఛార్జ్‌ల‌ను తీసుకుంటున్నాయ‌ని, ఇకపై రెస్టారెంట్లు, హోట‌ళ్లకు విధించిన‌ కొత్త విధానంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేంద్రం సూచించింది. మరోవైపు కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు స్పందించిన హోట‌ల్ సంఘం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మ‌ద్దతు తెలుపుతూ, క‌స్టమ‌ర్లకు న‌చ్చితేనే స‌ర్వీస్ ఛార్జ్ క‌ట్టవ‌చ్చని తెలిపింది.

 

 
 
 
Related News

JournalistDiary