India / Entertainment
నాకొక ‘లోఫర్’ కావలెను
218 days ago

లోఫర్ మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టేసింది దిశాపటానీ. ఈ ఫిల్మ్ తర్వాత టాలీవుడ్‌లో ఆఫర్స్ లేకపోయినా బాలీవుడ్‌లో వెనుదిరిగి చూడలేదు..వరస అవకాశాలతో బిజీ అయిపోయింది. మరిన్ని ఛాన్సుల కోసం తెరవెనుక పావులు కదుపుతోంది. రీసెంట్‌గా దబ్బూరత్నాని కేలండర్‌లో ఓ రేంజ్‌లో మెరిసిపోయింది. దిశాపటానీని ఈ పోజులో చూసినవాళ్లు మాత్రం సెమీన్యూడ్‌గా ఈ అవతారం ఏంటంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఈ పోజుల గురించి ఇంకా లోతుగా వెళ్తే.. కేలండర్ కోసం దిశా కనీసం టాప్ లెస్ పోజులు ఇవ్వలేదని, అదంతా కెమెరా మాయేనని అంటోంది. ఫస్ట్‌టైమ్ ఈ కేలండర్‌లో కనిపించడంతో మురిసిపోతోంది. మరి ఈ పోజుల వెనుక లోఫర్ బ్యూటీ స్టోరీ ఏంటో? ఏముందీ.. ఆఫర్ల  కోసమే ఈ అవతారమంటూ మాట్లాడుకోవడం ఆమె హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వంతైంది. 

 
 
Related News