India / Crime
భావన కేసు, దేశం వదిలి వెళ్లొద్దని నటి మంజుకి ఆంక్షలు
91 days ago

హీరోయిన్ భావన వేధింపుల కేసులో అరెస్టయిన నటుడు దిలీప్‌కుమార్‌ గురించి లేటెస్ట్‌న్యూస్. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చేవరకు  ఆయన మాజీ భార్య, నటి మంజూ వారియర్‌ దేశం వదిలి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఓ అవార్డుల ఫంక్షన్‌కు మంజు హాజరుకావాల్సి వుండగా సిట్‌ సూచన‌తో ఆ టూర్‌ని రద్దు చేసుకున్నట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నమాట.

 

అయితే ఈ వార్తలను మంజు ప్రతినిధి తోసిపుచ్చాడు. వృతి పరమైన కారణాలవల్ల టూర్‌ని రద్దు చేసుకున్నారని, పోలీసుల వల్ల కాదని అంటున్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన నటి భావన అపహరణ, లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే! ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీల్‌తోపాటు నటుడు దిలీప్‌ని కూడా అరెస్టు చేశారు. బాధితురాలు- మంజు క్లోజ్ ఫ్రెండ్స్ కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

 

Read Also

 
Related News
JournalistDiary