World / Politics
ట్రంప్ టీంలో అల్లుడిదే హవా
164 days ago

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వారసత్వ రాజకీయాలు తెరలేపారు. తన అల్లుడు 35 ఏళ్ల జారెద్ కుష్నర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు. ట్రంప్‌కు సీనియర్ సలహాదారుగా ఆయన్ని నియమించుకున్నారు. మిడిల్ ఈస్ట్, వాణిజ్యం వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్‌కు అప్పగించారు. దీనికి చట్టపరమైన ఆమోదం లభించిన వెంటనే సలహాదారుగా కుష్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్రంప్ కూతురు ఇవాంకాను పెళ్లి చేసుకున్నాడు కుష్నర్. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు షిఫ్ట్ అయ్యేందుకు కుష్నర్ సన్నాహకాలు చేసుకుంటున్నాడు.

 

 
 
 
Related News

JournalistDiary