Telangana / Crime
కుక్కునూరుపల్లిలో పోలీస్ స్టోరీ పార్ట్-2
6 days ago

బ్యూటీషియన్ శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి.. రెండూ ఆత్మహత్యలేనంటూ పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించేశారు. కానీ.. ఇద్దరి తరఫు నుంచీ అనుమానాల పరంపర మాత్రం ఆగడం లేదు. శిరీషది ముమ్మాటికి హత్యేనని, దర్యాప్తును తిరగదోడకపోతే కోర్టుకెక్కుతామని ఆమె పేరెంట్స్ చెబుతున్నారు. ఇటు, ఎస్సై మృతి మీద కూడా ఆదినుంచే సందేహాలున్నాయి. గెస్ట్ హౌస్ సీసీ టీవీ ఫుటేజ్ ఓపెన్ కాకపోవడం, మృతదేహంపై అనుమానాస్పద ఆనవాళ్లుండడం.. కొత్త డౌట్లను రేకెత్తిస్తున్నాయి.  ఇప్పటికే ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చనిపోయింది డిపార్ట్ మెంట్ వ్యక్తి పోలీసు శాఖ కూడా దీన్నంత తేలిగ్గా తీసుకునే వీల్లేదు. కాకపోతే.. పోలీసులే దర్యాప్తు మీద 'చేతివాటం' చూపుతున్నారన్న అనుమానాలు కూడా కేసు తీవ్రతను పెంచుతున్నాయి.

ఈ క్రమంలోనే.. కుకునూరుపల్లి పీఎస్ లో శనివారం దర్యాప్తు బృందం విచారణ మొదలుపెట్టింది. ఎస్సైగా పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహ్యతకు పాల్పడినట్లు ప్రాధమిక నివేదికలో రాసినప్పటికీ.. మరింత లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరాన్ని ఖాకీ శాఖ గుర్తించింది. దర్యాప్తు అధికారిగా ఛార్జ్ తీసుకున్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతి.. కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాల సేకరణ చేపట్టారు. గన్‌మెన్, డ్రైవర్, కొందరు కానిస్టేబుళ్ల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇప్పటికీ దీన్ని హత్యగానే భావిస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

 
 
 
Related News

JournalistDiary