World / Health
కాఫీ కబుర్లు..
52 days ago

రోజుకో మూడుకప్పులు కాఫీ తాగితేచాలు.. మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకోవడంతోపాటు పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన న్యూరిపోర్ట్ ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.

వీటితోపాటు పార్కిన్‌సన్.. నరాలకు సంబంధించిన వ్యాధులను కూడా నియంత్రించగల శక్తి కాఫీకి ఉందని యూరప్‌కు చెందిన ఆరు పెద్ద కాఫీ తయారీ సంస్థలు తేల్చాయి. అయితే  చాలాకాలం నుంచి కాఫీ వాడితే ఆరోగ్యపరంగా ఉపయోగాలున్నాయా? లేదా? లాంగ్ రన్ కాఫీ వాడకం శరీరానికి మంచిదా? కాదా?అనే విషయంపై సైంటిస్టులలో ఇంకా అభిప్రాయ బేధాలున్నాయి, కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది మహిళల్లో గర్భస్రావాలకు కారణమవ్వడం, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యే ప్రమాదముందనేది కొన్ని పరిశోధనల సారాంశం.

 
 
 
Related News

JournalistDiary