World / Health
కిక్కు తో క్యాన్సర్ గ్యారంటీ
365 days ago

నార్మల్‌గా ఎక్కువగా మద్యం సేవించేవారికే క్యాన్సర్ రిస్క్ వుంటుందన్నది అందరి ఒపీనియన్. కానీ తాజా అధ్యయనం ప్రకారం మోడరేట్ డ్రింకర్స్ కూడా ఈ వ్యాధి బారినపడే ప్రమాదముందని తేలింది. వొటాగో యూనివర్సిటీ రీసెర్చర్లు చేసిన ఈ స్టడీలో.. మామూలు స్థాయిలో మద్యం తాగినప్పటికీ గొంతు, నోరు, లివర్ వంటి శరీర భాగాలకు క్యాన్సర్ సోకుతుందని తేలింది. 

న్యూజిలాండ్‌లో గతంలో జరిపిన పరిశోధనల్లో 80 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి క్యాన్సర్ సోకిందని, 236 క్యాన్సర్ మరణాలు సంభవించాయని అంటున్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దీనివల్లే వచ్చే అవకాశముందని అంటున్నారు. రోజుకు సగటున రెండు డ్రింకులకన్నా తక్కువగా తాగేవారికీ ఈ మహమ్మారి సోకుతుందని, ఇప్పటివరకు హెవీ డ్రింకర్స్‌కు క్యాన్సర్‌కు గురయ్యేవారన్న అభిప్రాయం వుండగా, ఇలా సరికొత్త పరిశోధనలో ఈ విషయం రివీల్ కావడం విశేషం. న్యూజిలాండ్‌లో ఈ పరిశోధనలు జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం వుందని గుర్తుచేస్తున్నారు. 

 

 
 

Read Also

 
Related News

JournalistDiary