AP and TS / Politics
జగన్ చుట్టూ బిగిసిన ఉచ్చు!
114 days ago

జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. రీసెంట్‌గా కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈనెల 23 నుంచి ఆయన్ని కూడా విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మారిషస్ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న జగన్, తన ఆస్తులు జప్తు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విషయం తెల్సిందే! ముఖ్యంగా మారిషస్ లావాదేవీలపై ఫోకస్ పెట్టిన ఈడీ.. మరింత సమాచారం కోసం జగన్‌ని విచారించే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు పరిశీలించి అధికారులు, రేపో మాపో తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. విచారణ నేపథ్యంలో జగన్‌ని ఈడీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్న మాట. ఒకవేళ జగన్ జైలుకెళ్లితే శాసన సభ్యత్వం రద్దు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఈడీ చర్యల వెనుక కేంద్రంపై టీడీపీ ఒత్తిడి వుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary