India / Politics
జనవరి 13.. జెడ్జ్ మెంట్ డే..
194 days ago

ములాయం కుటుంబ కథాచిత్రం పూటకో మలుపు తిరుగుతూ  మరింత రక్తి కట్టిస్తోంది. కాబోయే సీఎం కొడుకేనంటూ సోమవారం ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన ములాయం.. ఆ దిశగా ప్యాచ్ అప్ పనుల్ని చకచకా కానిచ్చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా అఖిలేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు మంతనాలాడారు. చీలిక లేనట్లేనంటూ క్యాడర్ కు సంకేతాలిచ్చారు కూడా.

అయితే.. ఈ తండ్రీ కొడుకులిద్దరి తరఫున ఎలక్షన్ కమిషన్ దగ్గరున్న ఫిర్యాదు లేఖలైతే పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఎమ్మెల్యేల బలం తమకు ఎక్కువుందంటే.. కాదు.. మాకే ఎక్కువుందంటూ.. పార్టీ గుర్తు సైకిల్ కోసం గతంలో పోటాపోటీగా  లేఖలిచ్చారు. ఈ రెండు కంప్లయింట్స్ మీద జనవరి 13న విచారణ జరుపుతామని.. ఆ వెంటనే నిర్ణయం వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. అంటే జనవరి 13వ తేదీ సమాజ్ వాదీ పార్టీ భవిష్యత్తు ఏంటన్నది స్పష్టతకొచ్చే ఛాన్సుంది. అయితే  ఆలోపే.. నాన్నా కొడుకులిద్దరూ ఒక్కటైపోయి.. రాజీ కుదిరినా కుదరొచ్చు. 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary