India / Politics
సుప్రీం దెబ్బ బీజేపీకేనా ?
290 days ago

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కులం కార్డును వాడుకోకుండా సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏ పార్టీకూడా కులం, మతం, విశ్వాసాల ఆధారంగా ప్రజలను ఓట్లు అడగరాదని తీర్పునిచ్చింది. వీటికి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పాత్ర లేదని, ఎన్నికలన్నవి లౌకిక ప్రక్రియ అని అభిప్రాయపడిన కోర్టు.. దైవ భక్తి అన్నది ప్రజల విశ్వాసం పై ఆధారపడినది..అది పూర్తిగా వ్యక్తిగతమైనదని కూడా స్పష్టం చేసింది.

 

మతం, జాతి, కులం, భాష, వర్గం అన్న విషయాల్లో జోక్యం తగదని, వాటి జోక్యం ఉంటే అది అవినీతితో సమానమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123(3) లో హిజ్ రిలిజన్ అన్న పదం వాడడం పై కోర్టు విచారణ జరిపింది. 4.3 నిష్పత్తిలో ప్రకటించిన ఈ తీర్పులో చీఫ్ జస్టిస్ టీ. ఎస్ టాకూర్, న్యాయ మూర్తులు ఎం.బీ. లోకూర్, ఎస్.ఏ. బాబ్డే, ఎల్.ఎన్.రావు.. ఇక్కడ హిజ్ రిలిజన్ అంటే ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు అందరికి వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే న్యాయ మూర్తులు లలిత్, ఏకే గోయల్, డీవై. చంద్ర చూడ్ మాత్రం అభ్యర్థి మతం అన్న అర్ధం మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న యూపీ, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై  ఈ తీర్పు ప్రభావం పడవచ్చునని భావిస్తున్నారు.         

 

Read Also

 
Related News
JournalistDiary