AP and TS / Entertainment
బెటర్ లక్ నెక్స్ట్ టైం!
278 days ago

ఖైదీ సినిమాకి ఓ ఫ్యాన్ రివ్యూ :

బాస్ ఈజ్ బ్యాక్ ...అంటూ వాళ్ళన్నారు కానీ రీ ఎంట్రీ ఇచ్చుకోదగిసినిమా కాదని చూసిన తరువాత చెప్పేయొచ్చు. అసలీ సినిమా చిరు స్థాయిని పెంచే విధంగా లేదు. కాకపోతే చిరు తన ఫాన్స్ కోసం చేసిన డాన్సులు.. ఫైట్స్ సినిమా మైనస్ పాయింట్స్ ను కొంచెమైనా కప్పేసి వాళ్లకు సంతృప్తిని ఇచ్చాయి. ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించిన చిరు స్క్రీన్ పరంగా తన వయసును బ్రహ్మాడంగా, అందంగా తగ్గించుకోగలిగాడు కానీ డైలాగ్ డెలివరీ లో మాత్రం మునుపటి గాంభీర్యాన్ని పలికించలేకపోవడం స్పష్టంగా కనిపించింది. హావభావాల్ని పండించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కష్టపడినా దాఖలాలైతే ఉన్నాయి! ఇంకోసారి గట్టిగా చెప్పాలంటే అసలీ సినిమాకు చిరు రీఎంట్రీ ఇచ్చుకునేటంతటి స్థాయి మాత్రం లేదు. 

కధలో ఒకర్ని పోలిన మరో చిరు ఉండడం...రెండో క్యారక్టర్ని సృష్టించుకుని తమిళంలో ఎం పండించారో.. ఎలా పండించారో కానీ తెలుగులో మాత్రం కావాల్సినంత ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు అడ్డంగా ఫెయిల్ అయినట్లే లెక్క! సినిమా సినిమాగానే కమర్షియల్ సినిమాను అంత క్రిటికల్ గా చూడకూడదని ఎంత అనుకున్నా చిరంజీవి వంటి వ్యక్తులకు తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చినపుడు కధనం.. స్క్రీన్ప్లే  విషయంలో చాలా కేర్ఫుల్ గా బిహేవ్ చేసి ఉండాల్సింది. ఎంత హీరో చుట్టూ  తిరిగే కథకైనా మిగతా ఎలిమెంట్స్ జస్టిఫై చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ హాల్ఫ్ చివరిదాకా లాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చిన చిరు షాట్స్ ఎండ్ సీక్వెన్సెస్ కొంచెం పవర్ఫుల్గా కనిపించి రెండో హాఫ్ పట్ల కాస్త ఆసక్తిని రేకెత్తించాయి. అలీ నటనలో వైవిధ్యం పోయి చాలాకాలమైంది. చాలా ఏజెడ్ గా కనిపిస్తున్నాడు. బ్రహ్మీ తన మోనాటినీ నుంచి ఇక బ్రేక్ తీసునుకుంటే బెటర్.  ఇటువంటి సీనియర్లను పెట్టుకోవడానికి ఇకముందు కధలో ఎంతమేరకు అవసరం ఉందొ డైరెక్టర్స్ ఆలోచించుకోవాలి. నీరు నీరు పాటకు కావల్సినంత న్యాయం చేకూర్చలేదు. పాటలో ఉన్నంత పవర్ పిక్చరైజషన్ లో లేదు. రత్తాలు, అమ్మడూ పాటలు ఈలలేయించాయి. బిజీ..కెమెరా వర్క్స్ బావున్నాయి. ఓవరాల్ గా సినిమా చిరు సినిమా కాదు. ఒక ఫ్యాన్ గా చూసినా నాకు నచ్చలేదు. ఇంద్ర, టాగోర్ లాంటి సినిమాల్లో కంటే ఫిట్ గా కనిపించిన చిరంజీవి అటువంటి పవర్ఫుల్ కథను ఎంపికచేసుకోలేకపోవడం ఆయన వైఫల్యమే! బెటర్ లక్ నెక్స్ట్ టైం!

 

Read Also

 
Related News
JournalistDiary