World / Health
తిండి పుష్టి ఉంటే కండపుష్టి
169 days ago

కండగలవాడే మనిషోయ్ అన్నాడోకవి..  తిండి పుష్టి ఉంటే కండపుష్టి.. దానితో బాటు మెదడు పుష్టి కూడా కలుగుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. తొలినాటి నుంచి కూడా మీరు సంతులిత ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే  బ్యాలెన్స్‌డ్ డైట్ కు అలవాటు పడితే నే మంచిదటు.డైలీ తినే ఫుడ్లో   ఎక్కువగా కూరగాయలు, పళ్లు, ఆలివ్ ఆయిల్, తో  బాటు ఒక గ్లాస్ వైన్  కూడాతీసుకుంటే సెవెంటీస్ లో వచ్చే  మెదడు కుచించుకుపోవడం లాంట సమస్య దరిజేరదంటున్నారు డాక్టర్లు.

ఆయా రకాల పదార్ధాలుతీసుకోని వారిని పరిశీలిస్తే..  మెదడు కుచించుకుపోవడం, మెమొరీ లాస్, ఆల్జీమర్స్ లక్షణాలు బయటపడ్డాయట.సో.. మీరిప్పటికీ ఇంకా మధ్యధరా ఆహారపు అఅవాట్లు చేసుకోకపోతే వయసుతో వచ్చే సమస్యల బారిన పడకతప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇక మీరు తినే ఆహారంలో రోజూపండ్లు, వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్ ఉండేట్టు చెక్ చేసుకోవాలంటున్నారు. పళ్లు, తాజాకూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆక్సీకరణానికి ,న్యూరల్ డీ జనరేట్ గాకుండా తోడ్పడతాయటున్నాయి నివేదికలు.

 

యూనివర్సిటి ఆఫ్ ఎడిన్ బరోకు చెందిన మరో సైంటిస్ట్ డాక్టర్ మైఖెల్లో లూసియానో జరిపిన పరిశోథనలు వయసు పెరిగేకొద్దీబ్రెయిన్ లో ఉండే మెమొరీ, వినికిడిశక్తి సంబంధించిన కణాలు నిర్వీర్యమైపోకుండా సంతులిత ఆహారపు అలవాట్లు కాపాడుతాయని తేలింది. అదేవిధంగా మాంసకృత్తులు, పాల పదార్ధాలు, అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే.. మెదడు కుచించుకుపోవడం, మెదడులో ఉండే కణాలు దెబ్బతినడం, పార్కిన్ సన్ వ్యాధి బారినపడే ప్రమాదం తగ్గడం, క్యాన్సర్, కార్డియోవాస్క్యులార్ వ్యాధులనుంచి బయట పడొచ్చంటన్నారు డాక్టర్లు.

 

 
 
 
Related News

JournalistDiary