India / Crime
దొంగతనానికి వచ్చి.. ఆపై..
304 days ago

కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం మూడురోజుల్లో 45 లక్షల మంది తిలకించారు. ఒకవిధంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాల ట్రైలర్ల రేంజ్‌లో హంగామా చేస్తోంది. మూడేళ్ల కిందట జరిగిన ఘటన ఇది. నార్మల్‌గా ఈ తరహా ఘటనలు రోజూ చూస్తూనే వుంటాం. లొకేషన్ ఎక్కడ అన్నది పక్కనబెడితే... 

దాదాపు సాయంత్రం 5 గంటల సమయంలో ఓ వ్యక్తి టూ వీలర్స్‌ని దొంగతనం చేయడానికి ఓ ఇంటికి వచ్చాడు. అంతకు ముందు ఫ్రెండ్‌తో కలిసి గేటు బయట రెక్కీ నిర్వహించాడు అతగాడు. ఎవరూ లేరని భావించి గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బైకును తీసుకుని బయటకు వస్తున్న టైంలో వాహనం గేటులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేదు. ఈలోగానే అలర్టయిన ఇంటి ఓనర్.. వేగంగా బయటకు రాగానే బైకును వదిలి యువకుడు పరారయ్యాడు. ఈ తతంగమంతా సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

 

Read Also

 
Related News
JournalistDiary