World / Health
స్విచ్‌‌తో ఫ్యామిలీ ప్లానింగ్...
434 days ago

సంతానానికి కొద్దిగా గ్యాప్ ఇద్దామనుకునే యువ దంపతులకు ఇది గుడ్‌న్యూసే అంటున్నారు డాక్టర్లు. అప్పుడే పిల్లలొద్దనుకునే వాళ్ళు అదేపనిగా పిల్స్, రకరకాల మందులు వాడే పద్థతికి ఇక సెలవేనట. తేడా వచ్చినా, లేక వాటివల్ల వచ్చే ఇతరత్రా సమస్యలు లేకుండా ఉండేలా వేసక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ల జోలికి పోకుండా  ఒక కొత్త పద్థతి అందుబాటులోకి రాబోతోంది. బిమెక్  ఎస్ ఎల్ వి అనే పిలిచే ఈ పధ్ధతిలో  స్పెర్మ్ స్విచ్‌‌ని అమరుస్తారు. వీర్య నాళాల్లో స్పెర్మ్ ప్రవాహాన్ని నియంత్రిస్తుందీ స్విచ్.  అంగుళం కంటే తక్కువ పరిమాణంలో  ఉండి, ఒక ఔన్స్‌‌లో పదో వంతు బరువుండే  ఈ వాల్వ్‌‌ను  వృషణాల కింద ఉండే చర్మం అడుగు భాగంలో దీనిని అమర్చు్తారు.  

ఒక గంటసేపు పట్టే  ఈ సర్జరీలో  చిన్న ఆన్ ఆఫ్ స్విచ్  వీర్య నాళాలను నియంత్రిస్తుంది .పిల్లలు వద్దనుకంటే ఆన్, కావాలనుకుంటే  వాల్వ్ స్విచ్ ను ఆఫ్ చేసుకోవచ్చట. జర్మనీకి చెందిన  క్లిమెన్స్ బిమెక్   కనిపెట్టిన ఈ వాల్వ్ పద్ధతి లో.. స్పెర్మ్ నాళాల్లో  అమర్చిన ఈ  వాల్వ్  స్పెర్మ్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.  పిల్లలు వద్దనుకునే  ఆడాళ్లయినా,మగాళ్లయినా.. ఈ వాల్వ్ ను అమర్చుకోవచ్చు..ఒక చిన్న స్విచ్ సాయంతో  పని చేసే ఈ వాల్వ్ ఎవరికి వారేసొంతంగా  అపరేట్ చేయవచ్చట. ల్యాబ్‌‌లో దీని పనితీరుపై  జరిపిన పరీక్షల్లో నూటికి నూరుశాతం సంతృప్తి కరమైన రిజల్ట్స్ వచ్చాయనీ, మనుషుల మీద  దీని ప్రభావం పరీక్షించాలనీ, దీనికి మెడికల్ అనుమతి రాగానే అందుబాటులోకి తెస్తామంటున్నారు తయారీ దారులు.

 

 
 
 
Related News

JournalistDiary