India / Entertainment
కోర్టు కష్టాల్లో శాతకర్ణి
193 days ago

ఎటువంటి సినిమాలకు పన్ను మినహాయింపులివ్వాలి? ఎటువంటి సినిమాలకు  ప్రభుత్వం బాసటగా నిలబడాలన్న క్లారిటీ ఇప్పటిదాకా లేకపోవడం అనేక అనర్థాలకు తావిస్తోంది. అమరావతి చరిత్రను తెరకెక్కిస్తున్నామంటూ పబ్లిసిటీ ఇచ్చినంత మాత్రాన గౌతమీ పుత్ర శాతకర్ణికి వినోద పన్ను మినహాయింపుని ఎలా ఇస్తారు ? అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ పోటీ పడి మరీ బాలయ్య సినిమాను 'ఎంటర్ టైన్ మెంట్ టాక్స్' నుంచి తప్పించారన్నది పిటిషన్ సారాంశం. సినిమా అవుట్ ఫుట్ మీద కనీస అవగాహన లేకుండానే పన్ను రద్దు చేయడం.. ఆశ్రిత పక్షపాతం కిందకే వస్తుందని.. ఆదేశాల్ని వెనక్కు తీసుకోవాలని ఫిర్యాదీ చెబుతున్న మాట. ఇప్పటికే రుద్రమదేవి మూవీ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గుణశేఖర్ ఈ 'యవ్వారం'పై ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary